Tuesday, December 22, 2009

మీడియా బాధ్యత

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఉద్రిక్త పరిస్థితులని శాంతింప చెయ్యటానికి మీడియా ఒక నిర్మాణాత్మక, బాధ్యత గల పాత్ర నిర్వహిస్తే బాగుంటుందని సేనియర్ పాత్రికేయులు, పెద్దలు పొత్తూరి వెంకటేశ్వర రావు గారు వెలిబుచిన భావం తో నేను ఏకీభవిస్తున్నాను.

ఇలాంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పుడు మీడియా పాత్ర చాలా ప్రముఖమైనది అనటం లో ఏ మాత్రం సందేహం లేదు. వారు ప్రజల ఆవేశాలని, అల్లర్లని, హింసని యధాతధంగా ప్రసారం చెయ్యటం వలన అది చూసి మిగిలిన ప్రాంతాలలో వాళ్ళు మేము తక్కువ కాదు, వాళ్ళ కంటే ఎక్కువగా మా అభిప్రాయాలని, భావోద్వేగాల్ని వ్యక్త పరచ గలము అన్నట్లు ప్రవర్తించటం జరుగుతున్నది. ఇలాంటివి వీలైనంత తగ్గించి, రాజకీయ నాయకుల ప్రసంగాలని వీలైనంత సామరస్య పూర్వక ధోరణి లో నిర్వహించి ప్రసారం చేస్తే ప్రజలకి, ప్రజల ఆస్తులకి మేలు చేసిన వాళ్ళు అవుతారు.

ఈ ప్రాంతపు నాయకుల దిష్టి బొమ్మలని వాళ్ళు తగల బెట్టటం, వాళ్ళ నాయకుల బొమ్మలని వీళ్ళు తగలబెట్టటం ఎంత అనాగారికమో తెలుసుకునే పరిస్థితిలో విద్యార్ధులు లేని సందర్భం లో మీడియా లో చూపించే క్లిప్పింగుల విషయం లో కొంత జాగ్రత్త పడటం అవసరం కాదంటారా? ఆలోచించండి. మనసులో వచ్చిన ఆలోచన కంటే, కంటితో చుసిన విషయం మనిషిని ఎక్కువ ఆవేశానికి గురి చేస్తుంది. అలాంటప్పుడు మీడియా ఎంత జాగ్రత్త వహించాలో బాధ్యత గల వారు చెప్పించుకోవలసిన అవసరం ఉన్నదా?

తమ చానెల్ ప్రత్యేకతని కాపాడుకోవటం అంటే ప్రజా హింసని ప్రేరేపించటం కాకూడదు కదా.

ప్రజలు అంటే విద్యార్ధులు, ఉద్యోగస్తులు, వ్రుత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు విచక్షణా రహితంగా ప్రభుత్వ (నిజానికి ప్రజల ) ఆస్తులు తగల బెడితే మళ్ళీ ఆ నష్టం పూడ్చటానికి ఎన్నెన్ని పన్నులు కట్టాలి అనేది ఆలోచిస్తున్నారు అనిపించటం లేదు.

ప్రభుత్వ కార్యాలయాలలో రికార్డులు నాశనం చేస్తే, తమ లాంటి ఒక సామాన్య జీవి కి ఏ విషయంకంగా కాని జరిగే నష్టం ఏమిటో వీరి ఆవేశం చల్లారాక తెలుసుకున్నా ప్రయోజనం ఉంటుందా?

జరిగిన నష్టాన్ని పుడ్చాగాలమా? ఆవేశం ఎప్పుడు ఆలోచనని చంపేస్తుంది.

మన విద్యార్ధులు ఇంట ముర్ఖులా అని ప్రపంచం విస్తు పోయే లాగా ప్రవర్తించటం ఏ నాగరికతకి, విద్య కి చిహ్నం?

వాహనాలు తగలబెట్టటం, షాప్ ల ని ధ్వంసం చెయ్యటం వలన కలిగే ఆర్ధిక నష్టాన్ని ఈ ఆవేశ పరులు అంచనా వెయ్యగాలుగుతున్నారా ? ఆ చిన్న వ్యాపారులు ఏ బ్యాంకు ఆర్ధిక సహాయం తోనో వ్యాపారాలు చేసుకుంటూ ఉంటె, ఫర్నిచర్ ని నాశనం చేసి, అద్దాలు పగల గొట్టి, వారి కసి తీర్చుకుంటే, వాళ్ళు ఎప్పుడు కోలుకోవాలి? బ్యాంకు అప్పులు ఎలా తీర్చాలి ? అని బాధ్యత గల ఏ పౌరులైన ఆలోచిస్తున్నారా?

ఏ బ్యాంకు ఐన తన దగ్గర ప్రజలు దాచుకున్న సొమ్ము లో నించే అప్పులు ఇస్తుంది. ఇలాంటి సందర్భాలలో మా అప్పులు మేము వసూలు చేసుకునే అవకాసం లేదు, కాబట్టి మేము మీ డిపాజిట్లు తిప్పి ఇవ్వలేము అంటే మనము ఉరుకుంటామా? ఆలోచించండి.

ఇంతటి హింసని ప్రేరేపించిన ఏ రాజకీయనాయకుడైనా దీన్ని ఆలోచించారా? ఏది జరిగిన సామాన్య మానవుడి బ్రతుకే రోడ్డున పడుతుంది.

ఆవేశం ఎంత కాలం ఉంటుంది? అది చల్లారాక పోగొట్టుకున్న సంపద తిరిగి వస్తుందా? పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా ? కుటుంబాలకి జరిగిన నష్టం ఒకరు పూడ్చ గలిగిందా ? ఆలోచించండి.

మనది మహాత్ముడు పుట్టిన అహింసా భూమి. ఏ కోర్కె నైనా శాంతియుత విధానం లో ఎలా సాధించు కోవాలో మన పెద్దలు మనకి బాట చూపారు.

మీకు తెలుసా? జపాన్ దేశం లో నిరసన ఒక వినూత్న పదాతి లో వ్యక్త పరుస్తారుత. అది ఏమిటంటే మామూలు కంటే ఎక్కువ పని చెయ్యటం. మనము కుడా అది నేర్చుకుంటే అది నాయకత్వ దృష్టి ని ఆకర్షించ వచ్చు.

బాధ్యత కల రాజకీయ నాయకులారా ఇంకా ఆలస్యం చెయ్యకుండా మీరేదో చేస్తారు అని ఆశించే ప్రజలకి ఒక నిర్మాణాత్మక శైలి లో సందేశాలు ఇచి, ఈ మారణ హోమాన్ని ఆపండి.

ఓ మీడియా వాళ్ళ లారా, టీవీ లో ప్రసారం చేసే క్లిప్పింగుల పట్ల బాధ్యత వహించండి.

1 comment:

  1. మీడియా బాధ్యత!!?? ఏమిటీ కొత్త మాటా!! బాధ్యతగా ఉంటే పత్రికా స్వేచ్చ ఏమైపోతుంది. బాధ్యతకి స్వేచ్చకి మధ్య తేడా తెలిస్తే న్యూస్ టి.వి. లు పెట్టి ఇలా అల్లరి ఎందుకు చేస్తాం!!!

    ReplyDelete