Sunday, December 27, 2009

రాజకీయ ఉద్యమాలు - ఆంతర్యాలు

ఊరికే నినాదాలు చెసి, సానుభూతి చుపిస్తే కడుపు నిండదు. ఆకలి వేసిన వాడికి అన్నమో రొట్టో పెడితే కడుపు నిండుతుంది.
ప్రతి రాజకీయ నాయకుడు అవతలి వాళ్ళు ఎమి తప్పు చేఆశారో పదే పదే చెబుతూ, సభలల్లొ వ్యక్తి గత దూషణలకి దిగుతున్నారే కానీ, అవకాశం ఇస్తే తాము ఏ విధమైన (ఆచరణ సాధ్యమైన)విధానాలు పాటించ దల్చుకున్నారు, ఏ విధంగా ప్రజా జీవితం మెరుగు పరచ దల్చుకున్నారు అనే విషయం ప్రస్తావించటం లేదు.
ఇంత గొంతు చించుకు అరుస్తున్న నల్గొండ ఫ్లోరైడు సమస్య ఇప్పటి వరకు సమస్య గానే ఎందుకు మిగిలి పోయింది? అక్కడి నించి రాజకీయ ప్రాతినిధ్యం లేదా?
అలాగే మన గౌరవనీయ తెలంగాణా ప్రజా నాయకుదు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీం నగర్ ప్రాంతం లొ చేనేత కార్మికులు ప్రాణ త్యాగాలు ఎందుకు చేస్తున్నారు? ఆకలి చావులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఆ నరఘోష ఆపటానికి ఆయన తీసుకున్న చర్యలు ఎమిటి?
అవునులే ఆయనికి బయట పల్లకీ మోత లో ఇంట్లొ ఈగల మోత పట్టించుకో వలసిన విషయం గా కనిపించక పొయి ఉండచు.
అసలు ఇంతకీ తెలంగాణా వేర్పాటు నాయకులు ప్రత్యేక రాష్ట్రం ఎర్పడితే, ఇప్పటి వరకు కలిగిన నష్టాన్ని తాము ఎల పూడ్చ దలచుకున్నారు, రాష్ట్ర (వారు కోరుకున్న ప్రత్యేక రాష్ట్రం) సర్వతొముఖ అభివ్రుద్ధికి తమ ప్రణాలికలు ఎమిటి? అని ఒక్క సభలొనైనా ప్రస్తావిస్తున్నారా?
బాధ్యతలు లెని హక్కులు ప్రమాదకరం.
స్వాంతంత్ర్యం వచిన తరువాత, ఆంధ్ర రాష్ట్రం ఎర్పడిన ఈ ఎభై మూడు సంవత్సరాలనించి తెలంగాణా ప్రాంత శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు తమ తమ వెనుకబడిన ప్రాంతాల అభివ్రుద్ధికి ఎమైనా కార్యా చరణ ప్రణాలికలు రూపొందించించి, అవి చట్ట సభలలొ ప్రభుత్వ ద్రుష్టి కి, ఇతర సభ్యుల ద్రుష్టి కి తీసుకు వచారా? తమ సమస్యల పరిష్కారానికి పోరాడి సాధించుకొ గలిగారా?
ఆ పని ఎందుకు చెయ్య లెక పోయారు? పదవిలోకి వచెవరకు ఎల వస్తామా అనే రంధి, వచాక ఈ 5 సంవత్సరాలూ తము ఎంత సంపాదించి వెనక వేసుకొగలము, తమ బంధు / ఆస్రితులకి ఎలా పదవ్లు కట్ట బెట్టాలి అనె రంధి- దీనితోనె సరిపోతున్నది. ఇంక ప్రజా సమస్యలు ప్రస్తావించె సమయం ఎక్కడ పాపం, మనమె అర్ధం చేసుకోవాలి. కాబట్టి సమస్యలు అనేవి ఇంకొక 50 సంవత్సారాలు గడిచినా , ప్రత్యెఏక రాష్ట్రం వచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడె అని పాపం ఈ పిచి ప్రజలకి తెలియక అనావసరంగా కాలం వ్రుధా చెసుకుంటున్నారు.
ఈ విషయం అమాయక ప్రజలు ఎంత త్వరగా తెలుసుకుంటె ఈ ఉద్యమ ఉధ్రుతం అంత త్వరగా తగ్గి ప్రశాంత వాతా వరణం ఏర్పడుతుంది.
ఈ ఉద్యమాల వలన రజకీయ నాయకుల స్వార్ధ ప్రయోజనాలు నెరవేరుతాయె కాని, సామాన్య పౌరుడి కదుపు నింపేది, వాళ్ళ నెల జీతాలే.
హైదరాబాదు లో ఉన్న అనేక మంది మధ్య తరగతి, ఆ మాట కొస్తె ఈ మానవ, ఆస్తుల, మారణ హొమం జరుగుతున్న ఏ ప్రదెశం లొ ఉన్న మధ్య తరగతి వాళ్ళు ఐన ఆయా ప్రదెశాలలొ ఉండటానికి ప్రభుత్వొద్యొగాలొ, ఆ ప్రాంతాలలొ ఉన్న ప్రైవెటు సంస్థలలొ ఉద్యొగలొ కారణం. వాళ్ళు ఆ ఉద్యొగలలొ ఏ రిక్రూట్మెంట్ బొర్దు ద్వారానొ, ఇంకొక రకమైన పరీక్షలు రాసి మెరిట్ మీద ప్రవెసించిన వారె కాని, ఇంకొకరి హక్కులు కాల రాసెటంత అవసరం కాని అక్కర కాని లెనివాళ్ళె.ఎవరొ పెద్దలు చెప్పినట్లు ఇప్పటికైన బాధ్యత కల నాయకులు తమ నాయకత్వ బలపరీక్ష మానెసి, సమస్యని ఎవరు స్రుష్టించారు అనె చర్చ మానెసి, వాళ్ళె దీనికి పరిష్కారం చుపాలి అనె పలాయన వాదం మానెసి తమ వంతు చిత్త శుధి తొ కల్లొలిత ప్రాంతాలకి వెళ్ళి వాళ్ళని శంతింప చెసి,ధైర్యం గ నమ్మకంగ మాట్లాడితే అది ఆశించె ప్రజలకి కొంత ఊరట కలుగుతుంది. ఇప్పుదు వెంటనె చెయ్యవలసిన పని అది కాని, నిరాహార దీక్ష సిబిరాలు నడపటం కాదు. నాయకు లనె వాళ్ళు ఇలాంటి ఉద్యమాల నించె పుట్టుకొస్తారు.

Tuesday, December 22, 2009

మీడియా బాధ్యత

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఉద్రిక్త పరిస్థితులని శాంతింప చెయ్యటానికి మీడియా ఒక నిర్మాణాత్మక, బాధ్యత గల పాత్ర నిర్వహిస్తే బాగుంటుందని సేనియర్ పాత్రికేయులు, పెద్దలు పొత్తూరి వెంకటేశ్వర రావు గారు వెలిబుచిన భావం తో నేను ఏకీభవిస్తున్నాను.

ఇలాంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పుడు మీడియా పాత్ర చాలా ప్రముఖమైనది అనటం లో ఏ మాత్రం సందేహం లేదు. వారు ప్రజల ఆవేశాలని, అల్లర్లని, హింసని యధాతధంగా ప్రసారం చెయ్యటం వలన అది చూసి మిగిలిన ప్రాంతాలలో వాళ్ళు మేము తక్కువ కాదు, వాళ్ళ కంటే ఎక్కువగా మా అభిప్రాయాలని, భావోద్వేగాల్ని వ్యక్త పరచ గలము అన్నట్లు ప్రవర్తించటం జరుగుతున్నది. ఇలాంటివి వీలైనంత తగ్గించి, రాజకీయ నాయకుల ప్రసంగాలని వీలైనంత సామరస్య పూర్వక ధోరణి లో నిర్వహించి ప్రసారం చేస్తే ప్రజలకి, ప్రజల ఆస్తులకి మేలు చేసిన వాళ్ళు అవుతారు.

ఈ ప్రాంతపు నాయకుల దిష్టి బొమ్మలని వాళ్ళు తగల బెట్టటం, వాళ్ళ నాయకుల బొమ్మలని వీళ్ళు తగలబెట్టటం ఎంత అనాగారికమో తెలుసుకునే పరిస్థితిలో విద్యార్ధులు లేని సందర్భం లో మీడియా లో చూపించే క్లిప్పింగుల విషయం లో కొంత జాగ్రత్త పడటం అవసరం కాదంటారా? ఆలోచించండి. మనసులో వచ్చిన ఆలోచన కంటే, కంటితో చుసిన విషయం మనిషిని ఎక్కువ ఆవేశానికి గురి చేస్తుంది. అలాంటప్పుడు మీడియా ఎంత జాగ్రత్త వహించాలో బాధ్యత గల వారు చెప్పించుకోవలసిన అవసరం ఉన్నదా?

తమ చానెల్ ప్రత్యేకతని కాపాడుకోవటం అంటే ప్రజా హింసని ప్రేరేపించటం కాకూడదు కదా.

ప్రజలు అంటే విద్యార్ధులు, ఉద్యోగస్తులు, వ్రుత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు విచక్షణా రహితంగా ప్రభుత్వ (నిజానికి ప్రజల ) ఆస్తులు తగల బెడితే మళ్ళీ ఆ నష్టం పూడ్చటానికి ఎన్నెన్ని పన్నులు కట్టాలి అనేది ఆలోచిస్తున్నారు అనిపించటం లేదు.

ప్రభుత్వ కార్యాలయాలలో రికార్డులు నాశనం చేస్తే, తమ లాంటి ఒక సామాన్య జీవి కి ఏ విషయంకంగా కాని జరిగే నష్టం ఏమిటో వీరి ఆవేశం చల్లారాక తెలుసుకున్నా ప్రయోజనం ఉంటుందా?

జరిగిన నష్టాన్ని పుడ్చాగాలమా? ఆవేశం ఎప్పుడు ఆలోచనని చంపేస్తుంది.

మన విద్యార్ధులు ఇంట ముర్ఖులా అని ప్రపంచం విస్తు పోయే లాగా ప్రవర్తించటం ఏ నాగరికతకి, విద్య కి చిహ్నం?

వాహనాలు తగలబెట్టటం, షాప్ ల ని ధ్వంసం చెయ్యటం వలన కలిగే ఆర్ధిక నష్టాన్ని ఈ ఆవేశ పరులు అంచనా వెయ్యగాలుగుతున్నారా ? ఆ చిన్న వ్యాపారులు ఏ బ్యాంకు ఆర్ధిక సహాయం తోనో వ్యాపారాలు చేసుకుంటూ ఉంటె, ఫర్నిచర్ ని నాశనం చేసి, అద్దాలు పగల గొట్టి, వారి కసి తీర్చుకుంటే, వాళ్ళు ఎప్పుడు కోలుకోవాలి? బ్యాంకు అప్పులు ఎలా తీర్చాలి ? అని బాధ్యత గల ఏ పౌరులైన ఆలోచిస్తున్నారా?

ఏ బ్యాంకు ఐన తన దగ్గర ప్రజలు దాచుకున్న సొమ్ము లో నించే అప్పులు ఇస్తుంది. ఇలాంటి సందర్భాలలో మా అప్పులు మేము వసూలు చేసుకునే అవకాసం లేదు, కాబట్టి మేము మీ డిపాజిట్లు తిప్పి ఇవ్వలేము అంటే మనము ఉరుకుంటామా? ఆలోచించండి.

ఇంతటి హింసని ప్రేరేపించిన ఏ రాజకీయనాయకుడైనా దీన్ని ఆలోచించారా? ఏది జరిగిన సామాన్య మానవుడి బ్రతుకే రోడ్డున పడుతుంది.

ఆవేశం ఎంత కాలం ఉంటుంది? అది చల్లారాక పోగొట్టుకున్న సంపద తిరిగి వస్తుందా? పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా ? కుటుంబాలకి జరిగిన నష్టం ఒకరు పూడ్చ గలిగిందా ? ఆలోచించండి.

మనది మహాత్ముడు పుట్టిన అహింసా భూమి. ఏ కోర్కె నైనా శాంతియుత విధానం లో ఎలా సాధించు కోవాలో మన పెద్దలు మనకి బాట చూపారు.

మీకు తెలుసా? జపాన్ దేశం లో నిరసన ఒక వినూత్న పదాతి లో వ్యక్త పరుస్తారుత. అది ఏమిటంటే మామూలు కంటే ఎక్కువ పని చెయ్యటం. మనము కుడా అది నేర్చుకుంటే అది నాయకత్వ దృష్టి ని ఆకర్షించ వచ్చు.

బాధ్యత కల రాజకీయ నాయకులారా ఇంకా ఆలస్యం చెయ్యకుండా మీరేదో చేస్తారు అని ఆశించే ప్రజలకి ఒక నిర్మాణాత్మక శైలి లో సందేశాలు ఇచి, ఈ మారణ హోమాన్ని ఆపండి.

ఓ మీడియా వాళ్ళ లారా, టీవీ లో ప్రసారం చేసే క్లిప్పింగుల పట్ల బాధ్యత వహించండి.

Saturday, December 19, 2009

ప్రస్తుత ఆంద్ర రాజకీయాలు - విశ్లేషణ- ఆర్ధిక కొణం

రాజకీయ పార్టీల నాయకుల ఆంతర్యం అంతరాత్మ తెలియక , వారిని అనుసరించి ఉద్యమాలలో పాల్గొనే సామాన్య మానవుడి బతుకు గాలిలో పెట్టిన దీపం చందం ఊగిసలాడుతున్నది.



నలభై సంవత్సరాల మాట పక్కన పెడితే, గత ఐదారు సంవత్సరాలుగా తెలంగాణా అనే నినాదం కాస్త ఊపు అందుకున్న మాట వాస్తవం. సరే రెండు మూడు సంవత్సరాలుగా, ఎప్పుడు ఐతే తమకి సీట్లు తగ్గటం మొదలు పెట్టాయోఅప్పటి నించి,టీఆరెస్ నాయకులు తమకి చేతనైన గిమ్మిక్కులన్నీ చెయ్యటం మొదలు పెట్టాయి. దీనికి తందానా తాన అని , సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా , ఏ మాత్రం హోంవర్క్ చెయ్యకుండా, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలని ఆశించి మిగిలిన రాజకీయ పక్షాలన్నీ మేము తెలంగాణా కి అనుకూలం అంటూ పాట పాడటం మొదలు పెట్టాయి. కేంద్రం ప్రకటించినప్పుడు కదా, అసలు ప్రకటనే రాదు అనే నమ్మకంతో ఇప్పటి వరకు వ్యవహారాన్ని నడిపించాయి.

అసలు ఆ పరిస్థితి వస్తే , తీర్మానాన్ని ప్రవేశ పెడితే తమ వ్యూహం ఏమిటి, విధి విధానాలు ఏమిటి, ఎవరికీ అన్యాయం జరగకుండా ఉండటానికి తాము అనుసరించ దల్చుకున్న పధతులు ఏమిటి, నీటి వనరుల పంపిణీ లోను , ఎలాన్గానా ప్రాంతాన్ అభివ్రుది చేయబడిన మౌలిక సదుపాయాలలో తమకు న్యాయం గా రావలసిన వాటా ఎలా అడగదల్చుకున్నారు అనే విషయాల పట్ల హోం వర్క్ చేసి ఉండాలి. కాని మన దురదృష్టం కొద్దీ మనకున్న నాయకులందరూ అవకాసవాదులే తమ వంతు ప్రక్రియ తాము చెయ్యకపోగా, ప్రజల మనోభీష్టం ఇంటప్రగాధం గా ఉన్నాడని మేము ఉహించలేదు అనే ప్రకటన ఇవ్వటానికి సిగ్గు పడటం లేదు .




ఇవ్వాళ్ళ ఆ కారణం వల్లనే కేంద్రం, రాష్ట్రం లో మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఇందుకు సుముఖం ఉన్నాయ్ అనే సందేశం అందింది కనుకనే మేము ధైర్యం చేసాము అని చెప్పే పరిస్థితి వచ్చింది.

ప్రత్యెక తెలంగాణా ప్రకటన చేసే ముందు, మమ్మల్ని ఎవరిని సంప్రదించలేదు అనే సాకు ఎంతఅవకాసవాదమో చెప్పాలంటే మనము కొత్త నిఘంటువులని వెతకాలి.

రాష్ట్ర విభజన అంటూ జరిగితే, ఫలానా ఫలానా ప్రదేశాలు రాష్ట్ర పరిధి లో కి వస్తాయి, కామన్ నిధుల మరియు వనరుల పంపకం ఇలా ఉంటుంది, దీని వలన లాభ నష్టాలు ఇవి అని అన్ని ప్రాంతాల నిపుణులని, నాయకులని పిలిచి చర్చలు జరిపి సూత్ర ప్రాయం గ ఒక ముసాయిదా ని తయారు చెయ్యటం అనే ప్రక్రియ కేంద్రం చెయ్యకపోవటం బాధ్యతా రాహిత్య చర్య. ఈ పని రాష్ట్రం లోని మిగిలిన అన్ని (తెలంగాణా ని సమర్దిస్తున్నాము అని ప్రకటించిన )రాజకీయ పార్టీలు కూడా చేసి ఉండాలి. అందరు కలిసి చేసిన బాధ్యతా రాహిత్య పనుల వలన ఇవ్వాళ్ళ సామాన్య మానవుడి బ్రతుకు నది రోడ్డు మీద పడింది.



సామాన్య పరిపాలన లేదు, సంక్షేమ పధకాల అమలు లేదు . సగటు జీవితం స్తంభింతమే కాక బడుగు జీవి బ్రతుకు ప్రశ్నార్ధకం అయింది. దీనికి జవాబు దారులు ఎవరు ?






పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకి ఇప్పుడు జరుగుతున్నా నష్టం వేళ కోట్ల లో ఉన్నది అంటే దాని ప్రభావం రేపు కట్ట లేని పన్నుల రూపం లో అది మొత్తం ఆర్ధిక వ్యవస్థని దెబ్బ తియ్యడా ? ముందు ముందు ఉన్నా పరిశ్రమలు కొత్త చోటికి తరలి పోవని నమ్మకం ఏమైనా ఉన్నదా? కొత్త పరిశ్రమలని ఆకర్షించటానికి కావలసిన వాతావరణం, వాళ్ల నిబంధనలకి కట్టు బడటం అనే ప్రక్రియ లో వెనక బద్దాము , అందుకే కొన్ని పరిశ్రమలు వేరే రాష్ట్రాలకి తరలి పోయాయి అని బాధ పడుతుంటే , ఇప్పుడు ఉన్నవి పోయే పరిస్థితి వచ్చింది.








దీనికి మూల్యం ఎవరు చెల్లిస్తారు ?






అంతర్జాతీయ సంస్థలని ఆకర్షించాలంటే, నాయకులకి ఏంటో ముందు చూపు, అవగాహన ఉండాలి. మన అభివ్రుది పట్ల ఏంటో నిబధత ఉండాలి. కేవలం సందేశాలు ఇవ్వటం వలన, వేర్పాటు ధోరణుల వలన ఏమి సాధించలేము. రేపు మన ఆర్ధిక వ్యవస్థ బలోపేతం అవ్వాలంటే , ఈ పోటీ ప్రపంచం లో వచ్చిన ప్రతి అవకాసం ఉపయోగించుకోవాలంటే రాజకీయాలకి అతీతం గా ఆలోచించగలగాలి.





చాలా దేశాలకి లేని ప్రత్యేకతలు -వనరుల రీత్యా (ప్రక్రుతి మరియు మానవ ), వాతావరణ రీత్యా, మన దేశానికి ఉన్నాయి. దుబాయి దేశం తీసుకుంటే అక్కడ వర్షాలు లేవు, త్రాగు నీటి సౌకర్యానికి కావలసిన నదులు లేవు, ఖనిజ సంపద లేదు, వ్యవసాయ యోగ్త్యత (నీటి వనరులు లేక ) లేదు, వాతావరణ సమతుల్యత లేదు. అయినా అక్కడి నాయకులకి (ప్రభుత్వానికి ) అభివ్రుది చెందాలన్న తపన , తృష్ణ , అమెరికా లాంటి అభివ్రుది చెందినా దేశం తో పోటీ పాడాలన్న కసి ఉన్నయి కాబట్టి రాత్రింబవళ్ళు కష్ట పది అనుకున్నది అనుకున్నట్లు ప్రణాళిక బద్దం గా సాధిస్తున్నారు. ఒక ఇరవై సంవత్సరాల క్రిత్రం దుబాయి ఒక ఎడారి మాత్రమె. ఈ ఇరవై సంవత్సరాలలో వాళ్ళు సాధించినది చుస్తే ఎవరైనా మేచుకుని తీరవలసిందే. ఇప్పుడు వారు కూడా ప్రపంచ మాంద్యం లో కొంత ఇబ్బంది పడుతున్నా, వాళ్ళ కున్న ఆ అంకిత భావం తో తిరిగి పుంజు కోవటానికి ఎంతో సమయం పట్టా దు.





ఇక్కడ మనము చెప్పుకుంటున్నది పాలితులకి తెలంగాణా అభివ్రుది కాంక్ష, అంకిత భావం.





మనకి అన్నీ ఉంది కూడా మన వ్యక్తీ గత కక్షల కోసం, సాధించిన అభివ్రుధిని మన చేతులతో మనమే నాశనం చేసుకోవటానికి సిద్ధ పడుతున్నామంటే మన అవివేకం ఏ స్థాయి లో ఉన్నదో తెలుసుకుని సిగ్గు పడాలి.






ప్రజా నాయకుడు కెసిఆర్ గారు బ్రహ్మాండం బద్దలు అయినా భూ కంపం వచ్చిన ఉద్యమం నడిపి తీరుతాను. అని ప్రజలకి హామీలు ఇస్తున్నారు. భూ కంపం వస్తే మిగిలేది స్మసానమే కానీ, పచదనమూ కాదు, అభివ్రుది కాదు.





ఇది ఎంత పెద్ద దేబ్బో ఈ అవకాశవాద రాజకీయ నాయకులకి తెలుస్తున్నదా? వాళ్లకి అసలు మనస్సాక్షి అనేది ఉన్నదా?




Friday, December 18, 2009

అవకాశవాద రాజకీయాలు - అడుగంటిన ప్రజాక్షేమం

రాజకీయాల్లొ నాటకీయత పెరుగుతున్నదే కాని, ప్రజా సంక్షెమం అనేది 'నేతి బీరకాయలొ నెయ్యి లాగె' కనిపించకుండా పొతున్నది.

ఇవ్వాళ సమైక్య ఆంధ్ర కావాలని ఇంత గా నినదిస్తున్న నాయకులు, 1974 లొ ఆంధ్ర ఉద్యమం ఎందుకు చెశారని,ఒక తెలంగాణ నాయకుదు తెలివిగా మీడియా లొ ప్రశ్నించారు.
నిజమే, అది 40 సంవత్సరాల కిందటి మాట. అప్పటికి రాష్ట్రం ఇంత అభివ్రుది చెందలేదు. అప్పటి రాజకీయ నాయకులు ఇంత గా నోరు పారేసుకోలేదు . ఇంత అసభ్య పద జాలం ఉపయోగించలేదు.

పెద్దలు చెప్పినట్లు, "మాటకి మాట తెగులు, నీటికి నాచు తెగులు".

"తమలపాకు తొ నువ్వొకటి అంటె తలుపు చెక్క తొ నెనొకటి అంటాను" అన్నట్లు, కెసీఅర్ గారు హీనమైన, అసభ్య పదజాలం ఉపయోగించి ఆంధ్రులని తిట్టెటప్పటికి ఆంధ్ర నాయకులందరు ఆత్మ రక్షణ లొ పడాల్సి వచింది.తమ ప్రజలకి సమాధానం చెప్పుకొవలసిన పరిస్థితి ఎర్పద్డింది.

ఈ విషయం మొత్తం లో ఆలొచించవలసింది, ఆ వెళ (1974 లొ) హైదరాబాదు ఇవ్వాళ ఉన్నంత సంపదతొ, అవకాశాలతొ విదెశీయులని పెట్టుబదులతొ ఆకర్షించె స్థితి లొ లెదు. బహుశ అందుకె గౌరవనీయులు ఆనాటి నాయకులు అందరు ఊరుకున్నారు .

ఆ తరువాత ఎంతొ మంది ముఖ్య మంత్రులు తెలంగాణ నించి వచ్చిన వారు కూడా (పివి నరసిమ్హరావు గారు, తి అంజయ్య గారు, జలగం వెంగళరావు గారు)పరిపాలించారు. అప్పుడు ఈ ఆక్రోసిస్తున్న నాయకులు మాకేమి చేసారు అని కానీ , మాకు అన్యాయం జరిగింది అని కానీ అడగలేదు. వాస్తవానికి అన్యాయం జరగలేదు కాబట్టి.

ప్రభుత్వోద్యోగాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కాని, రైల్వే ఉద్యోగాలు ఐతే రైల్వే రిక్రుత్మేంట్ బోర్డు ద్వారా కాని మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయబదతాయే కాని, ప్రాంతీయ ప్రాదిపదికన అన్యాయమైన విధానాల ద్వారా కాదు అనే విషయం ఈ విద్యవేత్తలకి తెలియదా? ఇక ప్రైవేటు ఉద్యోగాలు, ఆయా సంస్థల భర్తీ విధానాల ద్వారా జరుగుతాయ్ కాని, వాటికి ప్రాంతీయత, అన్యాయం, మోసం హక్కులు కాలరాయటం అనే ప్రసక్తి ఉండదు అని మేధావులు తెలుసుకుంటే ప్రజలని మోసం చేసే నినాదాలు ఆక్రోశాలు ఉండవు.

ఇవ్వళ కెసీఅర్ చెప్పేవరకు మేధావులకి , లాయర్లకి తెలంగాణ వాదమే గుర్తు రాలెదు. ఎందుకంటే ఈ ప్రజాహింస, వెర్పాటు ధొరణి ఆయన ఒక పధకం ప్రకారం జనాలని రెచగొట్టి , తన పట్ల తన స్వంత పార్తి లొ నె ఉన్న అసంత్రుప్తి సెగలని చల్లార్చి వాళ్ళ దృష్టి మళ్ళించి అసమ్మతి ని అణచి వెయ్యటానికె పన్నిన వ్యుహం అంటె తప్పు అవుతుందా?

ఇంకా విచిత్రం ఎమిటంటె ఇవ్వళ, ప్రజా రాజ్యం పార్టీ తెలంగాణ విభాగం వాళ్ళు చిరంజీవి నించి విడిపొయి టీఆరెస్ లో చేరకుండా , "తెలంగాణ ప్రజారాజ్యం పార్టి" అనె కొత్త పార్టి గా ఆవిర్భావిన్చాతానికి సిద్ధ పడుతున్నారు అంటె, దీని బట్టి మనకి ఎమి అర్ధం అవుతున్నది, కెసీఅర్ ని వాళ్ళు తమ నాయకుడుగా ఆమొదించటానికి సిద్ధం గ లెరు. అలాగె తెలుగు దేశం (తెలంగాణా ) అయినా ,మరో పార్టీ ఐన.

ప్రజలు, ప్రజా నాయకులు ఇంతటి చైతన్యాన్ని, శక్తిని పెరిగే నిత్యావసర సరుకుల ధరలు దించటానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రస్నిన్చాతానికి, ఉపయోగిస్తే కిలొ కంది పప్పు ధర రు.100 నించి రు.16-20 కి, కిలొ ఉల్లిపాయల ధర రు.30 నించి రు.2 కి దిగి వచ్చేవి. ఆరోగ్యం, విద్య అంగడి సరుకు అయ్యేవి కావు.

Wednesday, December 16, 2009

స్పందన

ప్రపంచ వ్యాప్తం గా అందరి లోను ఒక భయం, అభద్రతా భావం - ఏమిటి ఇదంతా ?
జల ప్రళయం వస్తున్నదని, యుగాంతం అవుతున్నదని అనేక ఉహాలు, ఆలోచనలు, భయాలు, ఆందోళనలు...
ఒక చెప్పలేని కుతూహలం ..
ఇది ఇలా ఉంటే, మన స్వంత రాష్త్రం తీసుకుంటే, సెప్టెంబర్ ఒకట తారీకు నించి విపరీతమైన అలజడి, ప్రభుత్వ యంత్రాంగం అసలు పని చేస్తున్నదో లేదో తెలియదు, చేసినా , రోజు వారి కార్యక్రమాలు తప్ప ప్రణాళిక ల అమలు, అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష లు అసలే లేవు.

ఇంతలో పులి మీద పుట్రలాగ ప్రక్రుతి భీభాత్సాలు, వరదలు, తుఫానులు, అంటురోగాలు, ఊళ్ళకూళ్ళు కొట్టుకు పోవటం, కడుపు నింపే ఆహార ధాన్యాలు నీట మునిగి రైతన్న బతుకు వ్యధ, ఇటు తిండి గింజల కొరత-

ఈ పరిస్థితి కంటే కొందరి రాజకీయ నాయకుల కి పదవి గురించి చావో రేవో తేల్చుకోవటం ముఖ్యమే కాని, వాళ్ళని ఎన్నుకున్న ప్రజల స్థితిగతులతో సంబంధం లేదు. ఇది అవకాశం గా తీసుకుని కనీసం, ప్రజల దగ్గరకి వెళ్లి కలిగిన కష్టం మనస్ఫుర్తి గ తెలుసుకుని సహాయం చేసి వాళ్ల హృదయాలకి దగ్గర అవుదాము అనే ఆలోచన కలగక పోవటం శోచనీయం. ఇది తమకు అనుకూలం గా మార్చుకున్దామనే కనీసపు రాజకీయ ఆలోచన కూడా లేదు. భవిష్యత్తు మాట దేవుడెరుగు, కనీసం ఈ పరిస్థితి ఐన తమకు అనుకూలం గా మార్చుకుని ఉంటే ప్రజలకి వాళ్ల పట్ల కొంత సానుభూతి ఐన కలిగేది. ఆ మాత్రపు పరిణతి ఐన కనపరచ లేక పోయిన నాయకులు మనకి పాలకులు కావాలని కోరుకుంటున్నారంటే, అది వారి అలివి మాలిన స్వార్ధం కాక ప్రజా హిత మంటారా?

ఏమో ఆలోచించండి.
ఇక ఈ పరిస్థితి నించి గట్టేక్కామనుకుంటే, ఇంకో రకం (వి )నాయకులు, రాష్ట్రం ముక్కలు చెక్కలు చేసి, మా అందరికి తలా కొంచెం పంచండి అని నిరాహార దీక్షలు చేసే వాళ్ళు idantaa ప్రజా ప్రయోజనం కోసం chestunnaru అంటారా. ఏమో అది సమర్ధిస్తున్న మేధావులకి, vidyaavettalaki తెలియాలి.

ఈ మారణ హోమం నించి ఏ నిర్మాణాత్మక కార్యకలాపాలు సాధిద్దామని?
ఏమైనా నిర్మాణాత్మకంగా సాధించటానికి చాల కష్ట పడాలి కాని, నాశనం చెయ్యటానికి ఒక్క నిప్పు రవ్వ లాంటి ఆవేసపు మాట చాలు.
బయటి నించి విరుచుకు పడుతున్న ఉగ్రవాదపు భుతాలని ఎలా ఎదుర్కోవాలి, వాటి నించి ప్రజలని ఎలా కాపాడాలి అనే వ్యూహ రచన చెయ్యటానికి కాని, ఉన్నా బలగాలని ఉపయోగించి శాంతి భద్రతలని పరిరక్షించాతానికి అవకాశం కాని ఇవ్వకుండా పోలీస్ శక్తి ని antaa మన అంతర్గత సమస్యలు (అనవసరంగా మనకి మనము సృష్టించుకున్నవి ) పరిష్కరిన్చుకోవతానిని ఉపయోగించుకున్తున్నాము అంటే మన విజ్ఞత అంట ఎక్కఅడ తాకట్టు పెట్టామో ఆలోచించుకోవాలి. అసలు మనము విజ్ఞతతో ఆలోచిస్తున్నామా?

నిన్నటి వార్తల ప్రకారం తాలిబాన్ నించి ఆత్మహత్య దళం దేశం లోకి ప్రవేశించిందని విశ్వసనీయ సమాచారం. దానికి సంబంధించిన రక్షణ చర్యలు పటిష్టం గ తీసుకునేటందుకు, పోలీస్ లని వాళ్ల పనులు వాళ్ళని మనము చేసుకోనిస్తున్నామా?

అన్ని సమస్యలని రాజకీయం గానే పరిష్కరించలేము. కొన్నిటికి నిర్దుష్టమైన, సాంకేతిక పరమైన పంధాలోనే వెళ్ళాలి.
అవి అంతర్గత, ఆన్తరంగికమైన విషయాలు. వాటికి చర్చలు, ప్రజాభిప్రాయాలు ఉండవు.
దేశం మొత్తం ఈ విధంగా అట్టుడికి పోతూ ఉంటే, అవకాశం కోసం ఎదురు చూసే, బయటి శత్రువు కి పండుగే కదా. అంతర్గత కుమ్ములాటలు, బయటి శత్రువు బలపడటానికి అవకాశం ఇస్తుంది. ఇది చరిత్ర మనకి సిలాక్షరం గ తెలియ చేసిన కూడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేని మన చదువులు వృధా కాదా?

Monday, December 14, 2009

అసంక్షేమ మలిన రాజకీయాలు

'ప్రత్యేక తెలంగాణ' అనే సమస్య ఇవాల్టిది కాదు. 40 సంవత్సరాల నించి ఈ సమస్య ని ఆవకాశం వచ్చినప్పుడల్లా రాజకీయనాయకులు వాళ్ల సంకుచిత దృష్టి తో 'బుట్టలో దాచుకున్న పాము' లాగ బయటికి తీస్తూనే ఉన్నారు.

గౌరవనీయులైన కే.చంద్రశేఖర్ గారు అంత చిత్తసుద్ధి ఉన్న వాళ్లు ఐతే, వారి మీద వారి అనుయాయులకి అంత నమ్మకం ఉంటే, ఎన్నికలలో ఎందుకు క్రమక్రమంగా తమ స్థానాలు పోగొట్టుకున్నారు?, అని ఒక్కరైన ఆలోచించటం లేదు, అడగటం లేదు. అంతే కాదు, నిన్న గాక మొన్న జరిగిన 'గ్రేటర్ ఎన్నికల్లో' పోటీ చేయలేదు.

రాజకీయంగా పరిష్కారం కావలసిన ఏ అంశం ఐన సాధించుకునే పధతి ఒకటి ఉన్నది. అది ముందు majority సీట్స్ సంపాదించాలి, అంటే ప్రజలు వారి సిద్ధాంతాలతో ఏకీభవించి, వారిని శాసన సభకి ఎన్నుకుని, వారి ద్వారా తమ అభీష్టాలని నేరవేర్చుకోవటం.

ఈ విషయం లో చంద్రశేఖర్ గారిని ప్రజలు ఎంత మాత్రం ఆమోదించారో క్రమం గా తగ్గుతున్న వారి సీట్స్ సంఖ్యని బట్టి తెలుస్తూనే ఉన్నది. ఆయన ఎంత సేపు తన రాజకీయ అస్తిత్వం కోసం ప్రజలని వారి ఆవేశ కావేశాలని వాడు కున్నారు కాని ఎప్పుడు కింది స్థాయి తెలంగాణా పౌరుడు పడుతున్న అవస్థ ని పట్టించుకోవటం కాని, వారి అభివృద్ధి కి తానూ స్వయంగా సహాయం చెయ్యటం కాని చేశారా? అది అమాయక ప్రజలు ఎందుకు తెలుసుకో లేక పోతున్నారు. ఇన్ని ప్రాణ త్యాగాలు చేసిన కార్యకర్తల కుటుంబాలకి తను స్వయంగా ఏమి చేయగలడో, ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి వచినప్పుడు ఏమి చేశాడో చెప్పాడా? లేదు! ఎప్పటికప్పుడు తను రాజీనామా ఇచేస్తానని నాటకాలు ఆడటం, వాళ్లు బ్రతిమాలటం ఒక ఆనవాయితీగా మారింది. నిజంగా ప్రజల పట్ల నిబద్ధత ఉన్న నాయకుడు ఐతే, ఏమి చేస్తే వాళ్ల స్థితిగతులు మారతాయో, దానికి తన పార్టీ సిద్ధాంతాలు ఎలా నిర్దేశించ బడ్డాయో నిర్దుష్టంగా చెప్పాడా? లేదు!

నాలుగు సంవత్సరాల నించి ఒక పక్క ఆలమట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంచటం ద్వారా మన రాష్ట్రానికి కలుగుతున్న నష్టం ఏమిటో, దాన్ని మనమందరం ఎలా కేంద్రం ముందు చర్చించి మన హక్కులు ఎలా కాపాడుకోవాలో మాట్లాడిన రాజకీయ నాయకుడు ఒక్కడు లేడు. మరోపక్క బాబ్లి ప్రాజెక్ట్ పూర్తీ ఐతే మనకి జరిగే నష్టం గురించి ఆ రాష్ట్రం తో కాని, కేంద్రం తో కాని మాట్లాడి, పని సాధించుకు వచ్చిన నాయకుడు లేడు. ఏదో కాసేపు తు తు మంత్రం గా ధర్నాలు చెయ్యటం, గట్టిగ నిలబడవలసి వచినప్పుడు సీను లో నించి తప్పుకోవటం, ప్రెస్ కోసం ఫోటో లు దిగటం ఒక ఫ్యాషను అయిపోయింది.

ఒక రాష్ట్రం గా ఉన్నప్పుడే మన సమర్ధత ఇలా ఉంటే ఇక ముక్కలు చెక్కలు గా విడిపోతే ఇంక పొరుగు రాష్ట్రాలకి మన పట్లా మన హక్కుల పట్లా నిజాయితీ ఏముంటుంది. అడిగే వాళ్ళెవరు?

నిన్నటి తీవీ9 కార్యక్రమంలో, ముక్కలు చెక్కలు అయిన అగ్ర రాజ్యం రష్యా నించి మనమేమీ పాఠాలు నేర్చుకోలేమా? అని అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు అడిగిన ప్రశ్న ఆలోచింపదగినదిగా ఉన్నది. నిజమే కదా, అంత అగ్ర రాజ్యం కుప్ప కూలటానికి ఎంత సమయం పట్టింది?

ఉన్న వనరులన్నీ ప్రకృతి భీభాత్సాలకి (ఆరోగ్య, ఆస్తి నష్టాలకి) మళ్ళించితే, అభివృద్ధి కుంటుపడుతున్నది అని వాపోతుంటే, 'పులి మీద పుట్ర' లాగా, ఈ రాజకీయ సంక్షోభాలు - ఈ రాజకీయ నాయకులకి నిజంగా ప్రజల సమస్యల పట్ల సానుభూతి, నిబద్ధత ఉన్నాయంటారా?

రాష్ట్రాలైతే చిన్నవిగా విభజించి, మన అహం సంతృప్తి పరచుకోవాలనుకుంటున్నాము కాని,భౌగోళికంగా ఉన్న అటవీ భూములు, నదులు వాటి పరీవాహక ప్రాంతాలు, భూసారం, గనులు, వాతావరణ ప్రత్యేకతలని మనము శాసించగలమా ? మనము ఉన్న పరిస్థితులని అమొదించి, అందుకు అణుగుణంగా అభివృధి ఎలా సాధించగలము అనే దిస లో ఆలోచిస్తున్నామా?

ప్రభుత్వ పరంగా, ఇప్పటివరకు (స్వాంతంత్ర్యం వచాక) ఎన్ని ప్రాజెచ్టులలో పెట్టుబడులు పెట్టత్టం జరిగింది, లేదా ప్రయివేటు వ్యక్తులు పరిశ్రమలు పెట్టటానికి ముందుకు వస్తే ఎంత మేరకు సబ్సిడీలు ఇవ్వటం ద్వారా వనరులు సమకూర్చటం జరిగింది, అనే గణాంకాలు నిజాయితీగ ఎవరైన అడిగారా? ఇచ్చారా?

హైదరాబాదులో వ్యాపారాలు పెట్టి , పరిశ్రమలు పెట్టి , అందుకోసం ప్రభుత్వ భూమి ని లీజు మీద పొంది అభివృద్ధి చేసే ఆవకాశం మొదటి నించి అందరికి ఉన్నది. ఇంత ఆక్రోశిస్తున్న ఈ మేధవులందరూ అప్పటి నించి ఆ అవకాశాలని ఎందుకు ఉపయోగించుకోలేక పోయారు?

విత్తనం వెయ్యగానే కాయలు కాయవు. కాయలు కాయటం మొదలు పెట్టగానే, ఈ నేల మాది కాబట్టి మాకు మాత్రమె హక్కు అనటం సరైన పద్ధతా అని మేధావులు కూడా ఆలోచించలేక పోవటం వాళ్ల సంకుచితత్వానికి నిదర్శనం.

ఇవాళ్టి రోజున, విదేశాలలో, ఆంధ్రప్రదేశ్ అంటే మేధావుల గడ్డ అని గుర్తింపబడుతునది. దాన్ని మనమే మన చేతులతో మూర్ఖుల గడ్డ అని ఇవాళ్టి రోజున, విదేశాలలో, ఆంధ్రప్రదేశ్ అంటే మేధావుల గడ్డ అని గుర్తింపబడుతునది. దన్ని మనమే మన చేతులతో మూర్ఖుల గడ్డ అని నిరూపించబోతున్నాము అనిపించటం లేదా?

ఆలోచించండి.

నేను ఏ నినాదాన్ని గురించి కించపరచటం లేదు.

ప్రపంచం ఒక చిన్న కుగ్రామం అవుతున్న తరుణం లో మనం మాత్రం నా nela, నా గాలి అనే ధోరణిలో ఇంక ఇంక కుంచించుకు పోతున్నమేమో ఆలోచించండి.