Monday, December 14, 2009

అసంక్షేమ మలిన రాజకీయాలు

'ప్రత్యేక తెలంగాణ' అనే సమస్య ఇవాల్టిది కాదు. 40 సంవత్సరాల నించి ఈ సమస్య ని ఆవకాశం వచ్చినప్పుడల్లా రాజకీయనాయకులు వాళ్ల సంకుచిత దృష్టి తో 'బుట్టలో దాచుకున్న పాము' లాగ బయటికి తీస్తూనే ఉన్నారు.

గౌరవనీయులైన కే.చంద్రశేఖర్ గారు అంత చిత్తసుద్ధి ఉన్న వాళ్లు ఐతే, వారి మీద వారి అనుయాయులకి అంత నమ్మకం ఉంటే, ఎన్నికలలో ఎందుకు క్రమక్రమంగా తమ స్థానాలు పోగొట్టుకున్నారు?, అని ఒక్కరైన ఆలోచించటం లేదు, అడగటం లేదు. అంతే కాదు, నిన్న గాక మొన్న జరిగిన 'గ్రేటర్ ఎన్నికల్లో' పోటీ చేయలేదు.

రాజకీయంగా పరిష్కారం కావలసిన ఏ అంశం ఐన సాధించుకునే పధతి ఒకటి ఉన్నది. అది ముందు majority సీట్స్ సంపాదించాలి, అంటే ప్రజలు వారి సిద్ధాంతాలతో ఏకీభవించి, వారిని శాసన సభకి ఎన్నుకుని, వారి ద్వారా తమ అభీష్టాలని నేరవేర్చుకోవటం.

ఈ విషయం లో చంద్రశేఖర్ గారిని ప్రజలు ఎంత మాత్రం ఆమోదించారో క్రమం గా తగ్గుతున్న వారి సీట్స్ సంఖ్యని బట్టి తెలుస్తూనే ఉన్నది. ఆయన ఎంత సేపు తన రాజకీయ అస్తిత్వం కోసం ప్రజలని వారి ఆవేశ కావేశాలని వాడు కున్నారు కాని ఎప్పుడు కింది స్థాయి తెలంగాణా పౌరుడు పడుతున్న అవస్థ ని పట్టించుకోవటం కాని, వారి అభివృద్ధి కి తానూ స్వయంగా సహాయం చెయ్యటం కాని చేశారా? అది అమాయక ప్రజలు ఎందుకు తెలుసుకో లేక పోతున్నారు. ఇన్ని ప్రాణ త్యాగాలు చేసిన కార్యకర్తల కుటుంబాలకి తను స్వయంగా ఏమి చేయగలడో, ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి వచినప్పుడు ఏమి చేశాడో చెప్పాడా? లేదు! ఎప్పటికప్పుడు తను రాజీనామా ఇచేస్తానని నాటకాలు ఆడటం, వాళ్లు బ్రతిమాలటం ఒక ఆనవాయితీగా మారింది. నిజంగా ప్రజల పట్ల నిబద్ధత ఉన్న నాయకుడు ఐతే, ఏమి చేస్తే వాళ్ల స్థితిగతులు మారతాయో, దానికి తన పార్టీ సిద్ధాంతాలు ఎలా నిర్దేశించ బడ్డాయో నిర్దుష్టంగా చెప్పాడా? లేదు!

నాలుగు సంవత్సరాల నించి ఒక పక్క ఆలమట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంచటం ద్వారా మన రాష్ట్రానికి కలుగుతున్న నష్టం ఏమిటో, దాన్ని మనమందరం ఎలా కేంద్రం ముందు చర్చించి మన హక్కులు ఎలా కాపాడుకోవాలో మాట్లాడిన రాజకీయ నాయకుడు ఒక్కడు లేడు. మరోపక్క బాబ్లి ప్రాజెక్ట్ పూర్తీ ఐతే మనకి జరిగే నష్టం గురించి ఆ రాష్ట్రం తో కాని, కేంద్రం తో కాని మాట్లాడి, పని సాధించుకు వచ్చిన నాయకుడు లేడు. ఏదో కాసేపు తు తు మంత్రం గా ధర్నాలు చెయ్యటం, గట్టిగ నిలబడవలసి వచినప్పుడు సీను లో నించి తప్పుకోవటం, ప్రెస్ కోసం ఫోటో లు దిగటం ఒక ఫ్యాషను అయిపోయింది.

ఒక రాష్ట్రం గా ఉన్నప్పుడే మన సమర్ధత ఇలా ఉంటే ఇక ముక్కలు చెక్కలు గా విడిపోతే ఇంక పొరుగు రాష్ట్రాలకి మన పట్లా మన హక్కుల పట్లా నిజాయితీ ఏముంటుంది. అడిగే వాళ్ళెవరు?

నిన్నటి తీవీ9 కార్యక్రమంలో, ముక్కలు చెక్కలు అయిన అగ్ర రాజ్యం రష్యా నించి మనమేమీ పాఠాలు నేర్చుకోలేమా? అని అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు అడిగిన ప్రశ్న ఆలోచింపదగినదిగా ఉన్నది. నిజమే కదా, అంత అగ్ర రాజ్యం కుప్ప కూలటానికి ఎంత సమయం పట్టింది?

ఉన్న వనరులన్నీ ప్రకృతి భీభాత్సాలకి (ఆరోగ్య, ఆస్తి నష్టాలకి) మళ్ళించితే, అభివృద్ధి కుంటుపడుతున్నది అని వాపోతుంటే, 'పులి మీద పుట్ర' లాగా, ఈ రాజకీయ సంక్షోభాలు - ఈ రాజకీయ నాయకులకి నిజంగా ప్రజల సమస్యల పట్ల సానుభూతి, నిబద్ధత ఉన్నాయంటారా?

రాష్ట్రాలైతే చిన్నవిగా విభజించి, మన అహం సంతృప్తి పరచుకోవాలనుకుంటున్నాము కాని,భౌగోళికంగా ఉన్న అటవీ భూములు, నదులు వాటి పరీవాహక ప్రాంతాలు, భూసారం, గనులు, వాతావరణ ప్రత్యేకతలని మనము శాసించగలమా ? మనము ఉన్న పరిస్థితులని అమొదించి, అందుకు అణుగుణంగా అభివృధి ఎలా సాధించగలము అనే దిస లో ఆలోచిస్తున్నామా?

ప్రభుత్వ పరంగా, ఇప్పటివరకు (స్వాంతంత్ర్యం వచాక) ఎన్ని ప్రాజెచ్టులలో పెట్టుబడులు పెట్టత్టం జరిగింది, లేదా ప్రయివేటు వ్యక్తులు పరిశ్రమలు పెట్టటానికి ముందుకు వస్తే ఎంత మేరకు సబ్సిడీలు ఇవ్వటం ద్వారా వనరులు సమకూర్చటం జరిగింది, అనే గణాంకాలు నిజాయితీగ ఎవరైన అడిగారా? ఇచ్చారా?

హైదరాబాదులో వ్యాపారాలు పెట్టి , పరిశ్రమలు పెట్టి , అందుకోసం ప్రభుత్వ భూమి ని లీజు మీద పొంది అభివృద్ధి చేసే ఆవకాశం మొదటి నించి అందరికి ఉన్నది. ఇంత ఆక్రోశిస్తున్న ఈ మేధవులందరూ అప్పటి నించి ఆ అవకాశాలని ఎందుకు ఉపయోగించుకోలేక పోయారు?

విత్తనం వెయ్యగానే కాయలు కాయవు. కాయలు కాయటం మొదలు పెట్టగానే, ఈ నేల మాది కాబట్టి మాకు మాత్రమె హక్కు అనటం సరైన పద్ధతా అని మేధావులు కూడా ఆలోచించలేక పోవటం వాళ్ల సంకుచితత్వానికి నిదర్శనం.

ఇవాళ్టి రోజున, విదేశాలలో, ఆంధ్రప్రదేశ్ అంటే మేధావుల గడ్డ అని గుర్తింపబడుతునది. దాన్ని మనమే మన చేతులతో మూర్ఖుల గడ్డ అని ఇవాళ్టి రోజున, విదేశాలలో, ఆంధ్రప్రదేశ్ అంటే మేధావుల గడ్డ అని గుర్తింపబడుతునది. దన్ని మనమే మన చేతులతో మూర్ఖుల గడ్డ అని నిరూపించబోతున్నాము అనిపించటం లేదా?

ఆలోచించండి.

నేను ఏ నినాదాన్ని గురించి కించపరచటం లేదు.

ప్రపంచం ఒక చిన్న కుగ్రామం అవుతున్న తరుణం లో మనం మాత్రం నా nela, నా గాలి అనే ధోరణిలో ఇంక ఇంక కుంచించుకు పోతున్నమేమో ఆలోచించండి.

No comments:

Post a Comment